దివిసీమ కాళరాత్రికి @42ఏళ్లు

''ముగ్గురు బిడ్డలను నిద్రబుచ్చి, తను కూడా కూర్చుని కునుకుతీస్తూ, నిద్రలోనే బిడ్డలతో సహా అనంతలోకాలకు చేరిన తల్లి... కాళ్ల పారాౖణెనా ఆరకముందే జలసమాధి అయిన నూతన వధువు..'' ఆ నాటి దివిసీమ ఉప్పెనలో ఎక్కడ చూసినా ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే.. దివిసీమతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ప్రళయ బీభత్సం సృష్టించిన ఆ ఉప్పెన ఉత్పాతానికి నేటితో నలభై రెండేళ్లు. 1977 నవంబర్‌ 19 నాటి ఘోరకలి నుంచి తేరుకుని సాధారరణ పరిస్థితులు రావడానికి దివిసీమకు రెండేళ్లు పట్టింది.