** ప్రతి షాపుల్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి** నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి...
నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయం నందు కంచికచర్ల పట్టణంలోని పలు దుకాణాల యజమానులతో పాటు విలేకరుల సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది...
ఈ సందర్భంగా నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి మాట్లాడుతూ ప్రతి షాపు లోపల సీసీ కెమెరాలు ఉండటం తో పాటు షాపు బయట గల ఆవరణలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దానివలన నేరాలు తగ్గుముఖం పడతాయని, అలాగే షాప్ లో పనిచేసే మహిళలు ఎవరైనా ఉంటే వారిని సాయంత్రం ఏడున్నర గంటల లోపు పంపించి వేయాలని, తద్వారా ఆడపిల్లలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవచ్చు అని, పొద్దుపోయే వరకు కాకుండా జన సంచారం ఉన్నప్పుడే వారిని పంపించి వేయాలని డిఎస్పి రమణ మూర్తి షాపుల యజమానులను కోరారు.
అలాగే షాపుల ఎదురుగా వాహనాలు ఏర్పాటు చేయడానికి కానీ ట్రాఫిక్ కి ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని అలాగే కస్టమర్ శ్రేయస్సే మీ బాధ్యత కాబట్టి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, డిసెంబర్ 13వ తారీకు లోపు ప్రతి షాపు నందు బయట లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సైలు శ్రీ హరి బాబు ఫక్రుద్దీన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
**ప్రతి షాప్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి**